Header Banner

ఇషాన్ కిషన్ మాస్ బ్యాటింగ్.. బాదుడే బాదుడు.. దడ పుట్టించాడు!

  Fri May 23, 2025 22:24        Sports

ఐపీఎల్-2025లో తరచూ విఫలమవుతూ వస్తున్న స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. భారీ ఇన్నింగ్స్ ఆడాలనే కసితో ఉన్న లెఫ్టాండ్ బ్యాటర్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో చెలరేగి ఆడుతున్నాడు. మాస్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు నరకం చూపిస్తున్నాడు. 28 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ను అతడు చేరుకున్నాడు. ఇందులో 5 బౌండరీలతో పాటు 2 భారీ సిక్సులు ఉన్నాయి. అడ్డగోలు షాట్లకు వెళ్లకుండా లెక్క వేసి ఆర్సీబీ బౌలర్లను బాదుతున్నాడు ఇషాన్. గత మ్యాచుల్లో చేసిన పొరపాట్లను రిపీట్ చేయకుండా తన బలాన్ని నమ్ముకొని బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంకా నాటౌట్‌గా ఉన్న ఇషాన్.. ఆఖరి బంతి వరకు క్రీజులో ఉంటే సెంచరీ మార్క్‌ను అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 15 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 166 పరుగులతో ఉంది. ఇషాన్‌తో పాటు అభినవ్ మనోహర్ క్రీజులో ఉన్నాడు. ఇప్పటికే చాలా బంతులు ఎదుర్కొన్నందున ఇషాన్ ఎక్కువ స్ట్రైక్ తీసుకొనే అవకాశం ఉంది. కాబట్టి అతడికి సెంచరీ చేసే చాన్స్ ఉంది. అయితే మైల్‌స్టోన్ మీద కాకుండా జట్టుకు భారీ స్కోరు అందించడం మీద గురి పెడితే బాగుటుంది. కాగా, ఓపెనర్ అభిషేక్ శర్మ (17 బంతుల్లో 34), హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 24), అనికేత్ వర్మ (9 బంతుల్లో 26) రాణించారు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (10 బంతుల్లో 17) కూడా ఉన్నంత సేపు భారీ షాట్లు బాదాడు. అయితే ఇషాన్ ఎంతసేపు క్రీజులో ఉంటాడనే దాని మీదే సన్‌రైజర్స్ బిగ్ టోటల్ ఆశలు ఆధారపడి ఉంటాయి. మరి.. అతడేం చేస్తాడో చూడాలి.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! రూట్ లోనే ఫిక్స్ - నేషనల్ హైవేకు దగ్గరగా.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Sports #teamindia